: మొదలైన రిపబ్లికన్ల విజయ సంబరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయం కావడంతో రిపబ్లికన్ ప్రతినిధులు, ట్రంప్ అభిమానులు, ఆయన ప్రచార బృందం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకుంటున్నారు. ప్రస్తుతం 454 చోట్ల ఫలితాల సరళి వెలువడగా, ట్రంప్ 244 చోట్ల, క్లింటన్ 210 చోట్ల విజయం దిశగా సాగుతున్నారు. ట్రంప్ కు స్పష్టమైన ఆధిక్యం, లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 84 చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి వుండగా, అక్కడ కనీసం 30 చోట్ల విజయం సాధిస్తే, ట్రంప్ శ్వేతసౌధాధిపతి అయినట్టే. ప్రస్తుతమున్న సరళి చూస్తుంటే అదేం పెద్ద సమస్యేమీ కాదని, ట్రంప్ విజయం ఖాయమని తెలుస్తోంది.