: 48 ఎలక్టోరల్ ఓట్ల లీడింగ్ లో ట్రంప్... మార్పు కోరుకున్న అమెరికన్లు


అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ లీడింగ్ లో కొనసాగుతున్నారు. హిల్లరీతో పోలిస్తే ట్రంప్ ఇప్పటికే 48 ఎలక్టోరల్ ఓట్ల లీడింగ్ కు వెళ్లిపోవడంతో, అమెరికన్లు మార్పును కోరుకున్నట్టు స్పష్టమవుతోంది. మొత్తం 538 స్థానాలకు గాను 276 స్థానాల్లో ఓటింగ్ సరళి తెలుస్తుండగా, హిల్లరీ 109 చోట్లు, ట్రంప్ 167 చోట్ల ముందంజలో ఉన్నారు. వీటిల్లో ఇద్దరు నేతలూ ఇప్పటికే సగానికి పైగా సీట్లలో విజయం సాధించారు కూడా. ఇప్పటివరకూ 27 రాష్ట్రాలలో ఫలితాలు వెల్లడి కాగా, 17 రాష్ట్రాల్లో ట్రంప్, 10 రాష్ట్రాల్లో హిల్లరీ గెలిచారు. హిల్లరీ కన్నా 2 శాతం అధికంగా ఓట్లు ట్రంప్ కు పోలయ్యాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News