: 17న తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన
ఈ నెల 17న తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ‘దివిస్’ ఉద్యమంలో గాయపడ్డ బాధితులను జగన్ పరామర్శించనున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. తొండంగి మండలం కోన తీర ప్రాంతంలో దివిస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును పరిసర గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందేనని, ఈ రైతులకు జగన్ మద్దతుగా నిలవనున్నారని చెప్పారు. కాగా, దివిస్ లేబొరేటరీస్ ను రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తొండంగి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ప్రస్తుతం కొనసాగుతోంది.