: ఎన్డీటీవీ ప్రసారాల నిలిపివేతపై డిసెంబర్ 5న విచారణ


ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు (9వ తేదీ) నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఎన్డీటీవీ సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను నేడు విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశంపై విచారణకు తొందరేమీ లేదని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడిని టెలికాస్ట్ చేసిన సందర్భంలో ... ఎయిర్ బేస్ లోని కీలకమైన ప్రాంతాలను టీవీలో చూపించారనే ఆరోపణలతో ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు నిలిపివేయాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News