: కూకట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య కేసు: ఇంటి యజమాని దంపతులను సత్తుపల్లిలో పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శ్రీనివాస నగర్ కాలనీలో తన చావుకి ఇంటి యజమానే కారణమంటూ ఆరోపిస్తూ సుజాత అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన ఇంటి యజమాని ప్రసన్నకుమార్ దంపతుల వేధింపులే తన మరణానికి కారణమని గోడలు, తలుపులపై ఆమె రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరిపి చివరికి ప్రసన్నకుమార్, ఆయన భార్య స్నేహలతలను ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద అరెస్టు చేశారు. అనంతరం కూకట్‌పల్లిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.