: ఈత రాదని మొత్తుకున్నా వినలేదట... కన్నడ నటుల విషాదాంతం వెనుక స్టంట్ డైరెక్టర్ అత్యుత్సాహం!


సినిమా క్లైమాక్స్ దృశ్యాలను మరింత సహజంగా తీయాలని స్టంట్ డైరెక్టర్ రవి వర్మ ప్రయత్నించడం ఇద్దరు కన్నడ నటుల ప్రాణాలను హరించింది. తమకు ఈత రాదని ఎంత మొత్తుకున్నా వినని రవి వర్మ, వీరిని చాపర్ నుంచి కిందకు దూకాల్సిందేనని చెప్పడం, ఆపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే 'యాక్షన్' చెప్పడం వీరి మరణానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన వెనుక చిత్ర యూనిట్ నిలువెత్తు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. లైఫ్ జాకెట్లు అందుబాటులో లేకపోవడం, మరపడవలు దూరంగా ఉండటం తదితరాలు వారి మరణానికి కారణమయ్యాయి. ఒకేసారి ఇద్దరు విలన్లు కన్నడ సీమకు దూరం కావడం, బాధగా ఉందని కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీ తెలిపారు. హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్, జగ్గేష్ తదితరులు నటుల మృతికి సంతాపం వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News