: ఏపీకి పచ్చి మోసం జరుగుతున్నప్పుడు వీరంతా ఎక్కడ ఉన్నారు?.. 'హోదా' ఇక ముగిసిన అధ్యాయం!: తేల్చి చెప్పిన వెంకయ్య


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ, చంద్రబాబు, తాను మోసం చేశామని అంటున్న వారంతా విభజన సందర్భంగా ఏపీకి పచ్చి మోసం జరుగుతున్నప్పుడు ఏమయ్యారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని తేల్చి చెప్పారు. ‘విభజన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?’ అని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని, ఐఐటీ, ఐఐఎం వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏపీకి వచ్చిన విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఇవి చూసే వారికి కనిపిస్తాయని, వినే వారికి వినిపిస్తాయని పేర్కొన్నారు. కానీ తాము అవి చూడబోమని, వినబోమని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని అంటే తామేమీ చేయలేమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్నవారు అప్పుడు ఏమయ్యారని, ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వీటికి బదులిచ్చాకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే బాగుంటుందని వారికి సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News