: మహాత్మాగాంధీ మనవడు కానూభాయ్ కన్నుమూత
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు కానూ రాందాస్ గాంధీ(87) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సూరత్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందారు. కానూ గాంధీకి భార్య శివలక్ష్మి ఉన్నారు. కానూ గాంధీ నాసా మాజీ సైంటిస్టు. కాగా, 1930 మార్చి-ఏప్రిల్ లో నిర్వహించిన దండి సత్యాగ్రహం సమయంలో గుజరాత్ లోని దండి గ్రామంలో మహాత్మాగాంధీతో కలిసి చిన్నారి కనూ గాంధీ నడిచివెళ్తున్న ఫొటో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఫొటోలో గాంధీ చేతిలోని కర్రను ఒక వైపు పట్టుకున్న చిన్నారి కానూగాంధీ ముందు నడుస్తుండగా, ఆయన వెనుక మహాత్ముడు నడిచి వెళ్తుంటాడు.