: నయీమ్ కేసు: 413 మంది సాక్షులను విచారించిన సిట్.. 109 మంది అరెస్టు.. రేపు హైకోర్టుకు నివేదిక
తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఇప్పటి వరకు సేకరించిన సమాచార నివేదికను రేపు హైకోర్టుకు ఇవ్వనున్నారు. ఛార్జిషీట్‌లో పలువురు వీఐపీల పేర్లు నమోదు చేసినట్లు సిట్ అధికారులు మీడియాకు తెలిపారు. కేసులో ఇప్పటి వరకు మొత్తం 18 పోలీస్‌స్టేషన్‌లలో 109 మందిని అరెస్టు చేసినట్లు, 413 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్నారు.