: నాకు తెలిసినంత వరకు ఆ సినిమాలో ఐశ్వర్య చాలా అందంగా ఉంటుంది: అభిషేక్ బచ్చన్
తన భార్య ఐశ్వర్యా రాయ్ నటించిన 'యే దిల్ హై ముష్కిల్' సినిమాను ఇంతవరకు చూడలేదని బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చెప్పాడు. తన ఫుట్ బాల్ టీమ్ తో కలసి ప్రయాణిస్తుండటం వల్ల... ఆ సినిమాను చూసే సమయం తనకు దొరకలేదని తెలిపాడు. వచ్చే వారం తప్పకుండా చూస్తానని చెప్పాడు. తనకు తెలిసినంతవరకు ఆ సినిమాలో ఐశ్వర్య చాలా అందంగా ఉంటుందని అన్నాడు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్న ఫొటోలు చూశానని... ఐశ్వర్య కూడా కొన్ని ఫొటోలను చూపించిందని చెప్పాడు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని... కరణ్ జొహార్ కు, చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు, తన కాస్ట్యూమ్స్ విషయంలో భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యలు టిప్స్ ఇస్తుంటారని చెప్పారు.