: 6,50,000 ఈమెయిల్స్ ను ఎనిమిది రోజుల్లోనే చదివేశారా?: ఎఫ్ బీఐ డైరెక్టర్ ను ప్రశ్నించిన డొనాల్డ్ ట్రంప్


అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలయింది. రేపు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, ట్రంప్, హిల్లరీల్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న హిల్లరీ, ట్రంప్ లు ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో, ఎఫ్ బీఐ డైరెక్టర్ పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ కు చెందిన 6,50,000 ఈమెయిల్స్ ను కేవలం ఎనిమిది రోజుల్లోనే చదివేశారా? అని ప్రశ్నించారు. హిల్లరీ అక్రమాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని... ఎన్నో దారుణాలకు పాల్పడ్డ ఆమెను ఎఫ్ బీఐ వదిలిపెట్టరాదని అన్నారు. నేరాలకు పాల్పడ్డ హిల్లరీని అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టరాదని అమెరికన్లకు ఆయన పిలుపునిచ్చారు. మిచిగాన్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News