: నారాయణ కళాశాల వసతిగృహంలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య.. కాలేజీపై దాడి చేసిన విద్యార్థులు


చిత్తూరు జిల్లా రేణిగుంటలోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌ర‌ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. పలమనేరుకు చెందిన కమలేశ్ అనే విద్యార్థి ఉరివేసుకోవ‌డాన్ని గ‌మ‌నించిన‌ తోటి విద్యార్థులు ఈ విష‌యాన్ని యాజ‌మాన్యానికి చెప్పారు. కాలేజీ సిబ్బంది కమలేశ్‌ తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించారు. క‌ళాశాల వ‌ద్ద‌కు చేరుకున్న క‌మ‌లేశ్ త‌ల్లిదండ్రులు లెక్చ‌ర‌ర్ల ఒత్తిడి వ‌ల్లే త‌మ కుమారుడు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోపిస్తున్నారు. క‌మ‌లేశ్ మృతి ప‌ట్ల విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కళాశాల ఎదుట నిర‌స‌న తెలుపుతున్నారు. కాలేజీ భవన అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News