: బాప్‌రే! ట్రంప్ విమానం.. ఎగిరే బంగారం!


సాధారణంగా ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానమే ప్రపంచంలోని గొప్ప విమానాల్లో ఒకటని చాలామంది భావన. ఇక అత్యంత ఖరీదైన జీవనం గడిపిన దేశాధినేతల్లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఒకరని చెప్పుకుంటారు. ఆయన నివాసంలోని ప్రతీ వస్తువు బంగారంతో చేసిందేనని తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది. టాయిలెట్ నుంచి ఆయన కూర్చునే కుర్చీ వరకు అన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేసినవే. కానీ ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమానం ‘అంతకు మించి’ అన్నట్టు ఉంది. ట్రంప్ ప్రచారం కోసం వినియోగిస్తున్న బోయింగ్ 757-200 విమానంలోని ప్రతీదీ మేలిమి బంగారంతో మెరిసిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ విమానం ఎగిరే బంగారం అన్నమాట. ఇందులోని సౌకర్యాలన్నీ అత్యంత విలాసవంతమైనవి కావడం గమనార్హం. మరుగుదొడ్డి నుంచి ట్యాపుల వరకు అన్నీ బంగారంతో తయారుచేసినవే. విశాలమైన బెడ్‌రూం, సువిశాలమైన డ్రాయింగ్, బాత్రూం.. ఇలా ప్రతి ఒక్కదాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అపరకుబేరుడైన ట్రంప్ జీవనం అడుగడుగునా ఐశ్వర్యాల మేళవింపు అంటే అతిశయోక్తికాదేమో!

  • Loading...

More Telugu News