: శుభలేఖ నిండా క్రికెట్ సంగతులే... యువరాజ్ పెళ్లి శుభలేఖ విశేషాలు!


స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్, హాలీవుడ్ నటి హజల్ కీచ్ వివాహ సందడి మొదలైంది. యూవీ కుటుంబం పెళ్లి శుభలేఖను ముద్రించగా, దానిలో తనకు క్రికెట్ పై ఎంత ప్రేముందన్న విషయాన్ని యూవీ చెప్పకనే చెప్పాడు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ శుభలేఖలో 'సంగీత్' ఆహ్వాన పత్రంపై కీచ్ బ్యాట్ పట్టుకుని ప్యాడ్స్ కట్టుకుని ఉన్న క్యారికేచర్ ను ప్రచురించారు. రిసెప్షన్ కు ఇచ్చిన ఆహ్వానంలో పిచ్ మధ్యలో నిలుచున్న కొత్త జంటను చూసి 'భాయ్... షాదీ...' అంటున్న ఇతర క్రికెటర్ల క్యారికేచర్లు ప్రచురించారు. ఇక ప్రధాన చిత్రంగా, పిచ్ మధ్య డోలు వాయిస్తున్న యువరాజ్, నృత్యం చేస్తున్న కీచ్ చిత్రాలున్నాయి. ఈ వివాహం అటు గురుద్వారా సంప్రదాయంలో, ఇటు హిందూ సంప్రదాయంలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ నెల 30న సిక్కుల సంప్రదాయంలో, ఆపై డిసెంబర్ 2న గోవాలో హిందూ పద్ధతిలో వివాహం, 5న ఢిల్లీలో రిసెప్షన్, 7న చతర్ పూర్ లో మరో రిసెప్షన్ జరగనున్నాయి.

  • Loading...

More Telugu News