: నెల వ్యవధిలో మూడోసారి పెరిగిన 'పెట్రో' ధరలు... తెలుగురాష్ట్రాల్లో కొత్త ధరలివే


నిన్న లీటరు పెట్రోలుపై 89 పైసలు, డీజిల్ పై 86 పైసలు పెంచుతూ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్న తరువాత హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 72.22 (ఇండియన్ ఆయిల్), రూ. 72.25 (హిందుస్థాన్ పెట్రోలియం)కు చేరింది. 5వ తేదీ వరకూ రూ. 70.96గా ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ధర, తాజా ధరల పెంపు, ఆపై అందుకు తగ్గట్టుగా సుంకాలను కలిపిన తరువాత రూ. 1.26 పెరిగింది. ఇక హైదరాబాద్ లో డీజెల్ ధర లీటరుకు రూ. 61.53కు పెరిగింది. విశాఖపట్నంలో పెట్రోలు ధర రూ. 71.98కి, డీజిల్ ధర రూ. 61.36కు పెరిగింది. కాగా, గడచిన నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచినట్లయింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగడంతో పాటు, డాలర్ తో రూపాయి విలువలో వచ్చిన మార్పు కారణంగానే ధరలను సవరించాల్సి వచ్చిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News