: ఆసియన్ ఉమెన్స్ హాకీ ఛాంపియన్ ట్రోఫీ మనకే.. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చైనాను ఓడించిన భారత్!
సింగపూర్‌లో జరుగుతున్న ఉమెన్స్ ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ క్రీడాకారిణులు విజయ ఢంకా మోగించారు. ప్రత్యర్థి జట్టు చైనాపై 2-1తో గెలిచారు. 1-1 స్కోరుతో కొనసాగుతున్న మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించిన భారత క్రీడాకారిణి దీపిక అద్భుత ఆటతీరును కనబరిచింది. చూడచక్కని షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టి భారత్‌కు విజయాన్ని అందించింది. నిన్న చైనా హాకీ జట్టుతో జరిగిన ఫైనల్ లీగ్‌లో భారత్ ఓడిపోయింది. అయితే, ఈ రోజు గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో హాకీ ఉమెన్స్ టీమ్ పాయింట్ల పట్టికలో 7 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. చైనా 9 పాయింట్లతో మొదటిస్థానంలో ఉంది. జపాన్, కొరియా, మలేషియా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.