: అతనితో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు: హీరోయిన్ శ్రద్ధా కపూర్


బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ ల మధ్య ఎఫైర్ కొనసాగుతోందని బీటౌన్ లో ప్రచారం బాగా జరుగుతోంది. మీడియా కూడా ఈ అంశంపై బాగా ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఎఫైర్ వార్తలపై శ్రద్ధ స్పందించింది. ఫర్హాన్ కు, తనకు మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని ఆమె స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావటం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమకూ కుటుంబాలు ఉంటాయని... ఇలాంటి వార్తలతో కుటుంబసభ్యులు కంగారు పడతారని చెప్పింది. తనకు సోలోగా ఉండటమే ఇష్టమని... అలాంటప్పుడు ఫర్హాన్ తో ఎందుకు ప్రేమలో పడతానని ప్రశ్నించింది. తన ప్రేమ, పెళ్లి, రొమాన్స్ అంతా సినిమాతోనే అని... మరెవరితోనూ ప్రేమలో పడనని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News