: దక్షిణ భారత వంటకాల రెస్టారెంటు ధరణి ఇప్పుడు ఆల్బనీలో


యూఎస్ఏ, న్యూయార్క్, Nov 04th 2016(Press Note) : అమెరికాలో ఎంతో వేగంగా విస్తరిస్తున్న దక్షిణ భారత వంటకాల రెస్టారెంటు సంస్థ అల్తమౌంట్ ఆదరణ చెందుతున్న ధరణి రెస్టారెంటుని న్యూయార్క్ రాష్ట్రంలోని ఆల్బనీలో నవంబర్ 05న ప్రారంభించనుంది. న్యూయార్క్ లో వాణిజ్య మరియు సాంస్కృతిక ప్రాంతమైన ఆల్బనీలోని ఎందరో భోజన ప్రియులను, ముఖ్యంగా భారతీయ సమాజాన్ని ధరణి ఎన్నో రుచులతో అలరించనుంది. ఇందులో దక్షిణాదిలోని అన్ని ప్రాంతాల నించి ప్రముఖమైన వంటకాలను ధరణి అందించనుంది. చెట్టినాడు నించి హైదరాబాద్ విందుల వరకు, కోస్తా ఆంధ్ర నించి కేరళ సీమ వరకు అన్నిటిని ప్రాతినిధ్యం వహించే రుచులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. గిల్డర్ల్యాండ్ ప్రాంతంలో ఉండే ఈ రెస్టారెంటు 20 షాపింగ్ మాల్స్, క్రాస్ గేట్ మాల్స్, ఎంపైర్ స్టేట్ భవనం, స్టేట్ క్యాంపస్ ఆఫీసులు మరియు జిఈ కార్యాలయానికి ఎంతో చేరువ. 6000 చదరపు అడుగుల పురాతన ప్రాముఖ్యం కలిగిన భవనాన్ని అల్టామౌంట్ కొత్తగా తీర్చిదిద్ది 200 సీట్లు ఇంకా ఫంక్షన్ హాలుతో భారతీయత ఉట్టిపడే విధంగా రెస్టారెంటుగా మార్చింది. "1980 నించి ప్రముఖంగా ఉన్న ఈ భవనం ఇక్కడి ప్రజలకు ఎంతో ఇష్టమైనది. అందువల్ల దీని చారిత్రక ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గకుండా మలిచాము," అన్నారు ధరణి మేనేజింగ్ పార్టనర్ అశ్వని శ్రీధర్ తోటకూర. అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్ బిర్యానీ అందించే ఏకైక దక్షిణాది రుచుల రెస్టారెంటుగా కూడా ధరణి అవతరించబోతోంది. ఇవి కాకుండా ఎన్నో అద్భుతమైన రుచులు, మనసు దోచే వంటకాలు ఉంటాయి. వీటిలో కొన్ని కోస్తా ఆంధ్ర పెసరట్టు కుర్మా, నెల్లూరు చేపల పులుసు, కోడి ఇగురు, చికెన్ దం బిర్యానీ, పేపర్ రోస్ట్ 70 ఎంఎం దోస, ఎన్నై కత్రికాయి, చెట్టినాడు స్పైసి, ఇండో చైనా వంటకాలు. ఈ సందర్భగా మాట్లాడుతూ అల్టామౌంట్ గ్రూపు ఫౌండర్ అధినేత భాస్కర్ రెడ్నం ఇలా అన్నారు, "అమెరికాలో ధరణి వేగంగా విస్తరించటం ఎంతో ఆనందం కలిగిస్తోంది. అలాగే ఆదరణ రీత్యా కూడా ధరణి భారతీయ రుచులను అందిస్తూ, రుచికి నాణ్యతకి చిహ్నంగా ఎంతో ముందుంది. బోస్టన్ మరియు నార్త్ కరోలినా రెస్టారెంట్ల విజయంతో మేము మరింత విస్తరణవైపు అడుగులు వేస్తున్నాము. ఎన్నో ప్రాంతలనించి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మేము త్వరలో లతాం న్యూయార్క్, మసచుసెట్స్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూ జెర్సీ, వర్జీనియా మరియు నార్త్ కెరొలినాలలో విస్తరిస్తున్నాం. ఈ వారాంతం ధరణి ఆల్బనీకి విచ్చేసి మెగా బఫెట్ లంచ్ ఆస్వాదించండి: ధరణి ఆల్బనీ 2050 వెస్ట్రన్ అవెన్యూ, గిల్డర్ల్యాండ్, న్యూయార్క్ 12084 సంప్రదించండి: సుదీప్ శ్రీనివాస్ 603-921-4350 INFO@DHARANIUS.COM WWW.DharaniUS.COM Press note released by: Indian Clicks, LLC

  • Loading...

More Telugu News