: జయలలిత తనకు కావాల్సినవి అడుగుతున్నారు: అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి
జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఆమెను సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) నుంచి వేరే గదిలోకి మారుస్తామని చెప్పారు. చికిత్స పట్ల జయలలిత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తనకు కావాల్సినవి అడుగుతున్నారని వెల్లడించారు. అయితే ఆమెను డిశ్చార్జ్ చేసే అంశం మాత్రం తమ పరిధిలో లేదని చెప్పారు. ఈ రోజు చైన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు, జయలలిత ఆరోగ్యం కుదుటపడిందని అన్నాడీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పొన్నియన్ తెలిపారు. త్వరలోనే ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ప్రత్యేక గదిలోకి మారుస్తారని చెప్పారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని... శ్వాసకోశ వ్యవస్థ బాగుపడిందని ఆయన తెలిపారు.