: మా దేశంలో అంతే.. స్పిన్నర్లను మూడో తరగతి ప్రజల్లా చూస్తారు: గ్రేమ్ స్వాన్
స్పిన్ బౌలర్లను ఇంగ్లండ్ లో ఎలా చూస్తారో ఆ దేశ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ బయటపెట్టాడు. స్పిన్నర్లకు ఇంగ్లండ్ లో అసలు గుర్తింపు ఉండదని... వారిని మూడో తరగతి పౌరులుగా చూస్తారని చెప్పాడు. అందుకే ఇంగ్లండ్ లో ఎక్కువ మంది స్పిన్ బౌలింగ్ పై మక్కువ చూపించరని... తమ జట్టులో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండరని తెలిపాడు. ఈ కారణంగానే భారత్ తో జరగబోయే సిరీస్ ను తాము కోల్పోతామని చెప్పాడు. ఒక్కసారి భారత్ ను కుదురుకోనిస్తే... ఆ తర్వాత కోలుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.