: ఇంత ఆనందంగా నేనెప్పుడూ లేను: నరసింహన్

తన జీవితంలో ఇంత ఆనందంగా ఎప్పుడూ లేనని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. తన 70వ జన్మదినం సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. ఈ జన్మదినాన్ని ఎన్నడూ మర్చిపోనని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఫోన్ ద్వారా గవర్నర్ కు గ్రీటింగ్స్ చెప్పారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి వెళ్లిన కేసీఆర్ 70 పుష్పగుచ్ఛాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్టు తెలుస్తోంది.

More Telugu News