: లిబియాలో పెను విషాదం.. 240 మంది శరణార్థుల జలసమాధి


లిబియాలో పెను విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం వలస వెళ్తున్న కూలీలు కడుపు నిండకుండానే జల సమాధి అయ్యారు. లిబియాకు చెందిన శరణార్థులు ప్రయాణిస్తున్న రెండు చిన్న పడవలు ప్రమాదవశాత్తు నీట మునిగిపోవడంతో ఏకంగా 240 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు, గర్భవతులు, వృద్ధులు ఉన్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టిన గస్తీ దళాలు కేవలం 31 మందిని మాత్రమే ప్రాణాలతో రక్షించగలిగాయి. లిబియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడి ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. ఇటువంటి ప్రమాదాలు తరచూ ఇక్కడ సంభవిస్తున్నా, ఇంత పెద్దమొత్తంలో శరణార్థులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని ఐక్యరాజ్యసమితి వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News