: బాలీవుడ్ బాద్ షా బర్త్ డే వేడుకల ఫొటోలు.. నెట్ లో హల్ చల్!
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన 51వ పుట్టినరోజు వేడుకల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. షారూక్ తన 51వ పడిలోకి అడుగుపెట్టింది నిన్ననే అయినప్పటికీ, ఒకరోజు ముందుగానే తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ముంబయికి సమీపంలో ఉన్న తన అలీబాగ్ బీచ్ హౌస్ లో జరిగిన ఈ వేడుకలకు షారూక్ భార్య గౌరీ, ప్రముఖ దర్శకుడు కరణ్ జొహార్, నటుడు రణ్ బీర్ కపూర్, అయన్ ముఖర్జీ, అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతానందా, ఫిల్మ్ మేకర్ జోయా అక్తర్ తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ బర్త్ డే వేడుకలకు సంబంధించి షారూక్ తో దిగిన ఫొటోను ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ సంజయ్ కపూర్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వేడుకలకు సంబంధించిన మరికొన్ని ఫొటోలను కరణ్ జొహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.