: మలప్పురం కలెక్టరేట్ ప్రాంగణంలో బాంబు పేలుడు కేసు: ఉగ్రవాదుల టార్గెట్లో ప్రధాని మోదీ
రెండు రోజుల క్రితం కేరళలోని మలప్పురం కలెక్టరేట్ ప్రాంగణంలో పార్కింగ్ చేసిన కారులో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు పలు విషయాలు తెలిశాయి. ఉగ్రవాదుల టార్గెట్లో దేశంలోని పలు కట్టడాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నట్లు సమాచారం. బాంబు పేలుడు అనంతరం అక్కడకు చేరుకొన్న పోలీసు అధికారులు పలు ఆధారాలు సేకరించారు. అక్కడ దొరికిన ఓ పెన్ డ్రైవ్లో నరేంద్రమోదీ, పార్లమెంట్, ఎర్రకోటతో పాటు పలు ఫొటోలు ఉన్నాయి.