: కోరాపుట్ జిల్లా నేష‌న‌ల్ హైవే ద‌గ్గ‌ర‌ మందుపాతరను అమర్చిన మావోయిస్టులు.. నిర్వీర్యం చేసిన పోలీసులు


మావోయిస్టుల పిలుపు మేరకు ఐదు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో బంద్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో భారీగా మోహ‌రించిన పోలీసులు ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఛత్తీస్‌గ‌ఢ్ కోరాపుట్ జిల్లాలో నేష‌న‌ల్ హైవే ద‌గ్గ‌ర మావోయిస్టులు అమ‌ర్చిన‌ మందుపాతరను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ప‌రిస‌ర ప్రాంతాల్లో సోదాలు కొన‌సాగిస్తున్నారు. మ‌రోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఈ రోజు మ‌ధ్యాహ్నం 11 మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

  • Loading...

More Telugu News