: భోపాల్‌లో సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో కేసుల మూసివేత!


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సిమీ ఉగ్రవాదులు ఎన్‌కౌంటరైన సంగతి తెలిసిందే. మృతి చెందిన ఉగ్రవాదుల్లో నలుగురిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐదు కేసులు ఉన్నాయి. అయితే సోమవారం వీరు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో వీరిపై నమోదైన కేసులును కొట్టివేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి కేసుల మూసివేత గురించి తెలియజేయాలని భావిస్తున్నారు. మృతి చెందిన 8 మందిలో అంజాద్ ఖాన్ అలియాస్ పప్పు, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు, మహ్మద్ సాలఖ్ అలియాస్ సల్లు, జకీర్ హుస్సేన్ అలియాస్ సాదిఖ్‌‌లపై తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌లో వీరంతా హతమవడంతో అక్కడి పోలీసుల నుంచి రికార్డులు సేకరించి వాటిని కోర్టుకు సమర్పించి కేసుల్ని మూసేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News