: కొనసాగుతున్న మావోల బంద్.. ఐదు రాష్ట్రాల్లో హై అలర్ట్


ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టులు తలపెట్టిన బంద్ కొనసాగుతోంది. మావోల బంద్ పిలుపుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లో బలగాలను భారీగా మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఏవోబీలో హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఏజెన్సీలోకి వచ్చే అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. తమకు చెప్పకుండా పర్యటించవద్దని ప్రజాప్రతినిధులకు పోలీసులు సూచించారు. ఏజెన్సీలో పలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. బంద్‌కు సహకరించవద్దంటూ వ్యాపారులకు సూచించారు. తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. మాజీ మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు.

  • Loading...

More Telugu News