: ఐసిస్ చీఫ్ ను చుట్టుముట్టిన ఇరాక్ బలగాలు
ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదిని ఇరాక్ బలగాలు చుట్టుముట్టాయి. మోసూల్ నగరంలో బగ్దాదిని చుట్టుముట్టినట్లు సమాచారం. కాగా, ఇరాక్ లోని మోసూల్ పట్టణంలోని పలు ప్రాంతాలు ఐఎస్ అధీనంలో ఉండటంతో, ఇరాక్ బలగాలు వారిపై దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎస్ చెర నుంచి పలు ప్రాంతాలకు విముక్తి కల్పించారు. ఈ క్రమంలోనే ఐసిస్ చీఫ్ ను చుట్టుముట్టినట్లు సమాచారం.