: 'కబాలి' సినిమా నిర్మాత కలైపులి ఎస్‌.థాను అరెస్టుకు కోర్టు ఆదేశాలు


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్‌.థాను గతంలో ఓ వ్య‌క్తికి చెల్లించాల్సిన డ‌బ్బును ఇంత‌వ‌ర‌కూ చెల్లించ‌క‌పోవ‌డంతో ఆయనను ఈ నెల 28లోగా అదుపులోకి తీసుకోవాలని నాగర్‌కోవిల్‌ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. త‌న‌కు స‌ద‌రు నిర్మాత‌ చెల్లించాల్సిన రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌డం లేద‌ని నాగర్‌కోవిల్‌కు చెందిన క్యూ థియేటర్‌ యజమాని డేవిడ్ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాడు. విచార‌ణ జ‌రిపిన కోర్టు 2013 లో తీర్పునిస్తూ వెంటనే ఆ డ‌బ్బుని చెల్లించాలని థానుకు ఆదేశాలు జారీ చేసింది. అయతే, న్యాయ‌స్థాన ఆదేశాల‌ను థాను లెక్క‌చేయ‌లేదు. దీంతో డేవిడ్ మరోసారి న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు. థాను వ‌ద్ద‌ డబ్బు ఉండి కూడా త‌న‌కు ఇవ్వాల్సిన డ‌బ్బుని ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. దీంతో కోర్టు పై విధంగా తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News