: ఏపీ కాపీ కొట్టినా... ర్యాంకు పంచుకోవడం సంతోషమే: కేటీఆర్


ఈవోడీబీ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంకు రావడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక 9 నెలల కష్టం ఉందని ఆయన తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతోనే ఇది సాధ్యమయిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఏపీ కాపీ కొట్టినా... తమతో కలసి ర్యాంక్ పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ర్యాంకును ఎవరితో పంచుకుంటారని కేంద్ర ప్రభుత్వం ఒకవేళ తమను అడిగినా, ఏపీతోనే పంచుకుంటామని చెప్పేవాళ్లమని కేటీఆర్ తెలిపారు. ఎన్నో ఏళ్లు కలిసున్నాం... పైగా తెలుగు వాళ్లం కదా? అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో పాలన మెరుగ్గా ఉందంటూ సర్వేలు చెబితే అంతా బోగస్ అన్నారని... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ర్యాంక్ ఇచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెచ్చుకున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News