: నివురుగప్పిన నిప్పులా ఏవోబీ.. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టుల బంద్ పిలుపు.. ఐదు రాష్ట్రాల్లో టెన్షన్.. టెన్షన్

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా వుంది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో బంద్‌కు మావోలు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో బలగాలను భారీగా మోహరించారు. ఏజెన్సీలోకి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తమకు చెప్పకుండా ప్రజాప్రతినిధులు పర్యటించవద్దని సూచించారు. పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఏజెన్సీ ప్రాంతాలు మార్మోగుతుండడంతో ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. ఏపీలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుతోపాటు తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాచలం ఏజెన్సీలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. హై అలెర్ట్ ప్రకటించి నిఘా పెంచారు.

More Telugu News