: పాక్ బలగాల కాల్పులపై రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన జమ్ముకశ్మీర్ గవర్నర్
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ, ఆర్నియా, నౌషీరా, రామ్‌గఢ్ సెక్టార్లలో పాకిస్థాన్ రేంజర్లు ఈ రోజు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. కాల్పుల్లో గాయపడ్డ మరికొంతమందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో పాక్ కాల్పుల గురించి ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్ వోరా కలిశారు. అక్కడ తీసుకుంటున్న చర్యలపై వివరిస్తున్నారు.