: ఎన్‌కౌంట‌ర్ పేరుతో నాట‌కాలాడుతున్నారు.. ఆర్కే బ‌తికే ఉన్నాడు: వ‌ర‌వ‌ర‌రావు


ఇటీవ‌ల ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం(ఏవోబీ)లో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై విరసం నేత వరవరరావు మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర‌, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు క‌లిసి ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నాయని అన్నారు. ఎన్‌కౌంట‌ర్ పేరుతో నాట‌కాలాడుతున్నారని విమ‌ర్శించారు. పోలీసులు ప్రజలని గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. ఎన్‌కౌంట‌ర్‌పై విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులోనే ఆర్కే, మ‌రో తొమ్మిది మంది ఉన్నార‌ని ఆరోపించారు. ఈ రోజు బలిమెల రిజ‌ర్వాయ‌ర్లో దొరికిన మృత‌దేహం అర్కేది కాదని చెప్పారు. ఆర్కే బ‌తికే ఉన్నాడ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News