: పవన్ అభిమాని ఎడిట్ చేసిన ‘మెగా’ దీపావళి ఫొటో చూడండి!


దీపావళి పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి.. సోదరుడు నాగబాబు, నీహారిక, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సాయిధరమ్ తేజ్, అర్జున్, అల్లు శిరీష్ తో కలిసి ఒక ఫొటో దిగారు. ఈ ఫొటోను మెగాస్టార్ 150వ చిత్రమైన ‘ఖైదీ నంబర్ 150’ ట్విట్టర్ ఖాతా ద్వారా రామ్ చరణ్ తన అభిమానులతో పంచుకున్నాడు. ‘అన్నయ్య కుటుంబం ‘మెగా కింగ్ డమ్’ మెగా వారసులు.. మెగా ఫ్యామిలీ’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే, ఈ ఫొటోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేడు. తాజాగా, ఈ ఫొటోను పవన్ అభిమాని ఒకరు ఎడిట్ చేశాడు. ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ కూడా ఉంటాడు. ఆ ఫొటోను ‘పవనిజమ్’ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. ‘సూపర్బ్ ఎడిట్ బై ఏ ఫ్యాన్’ అంటూ ఆ ట్వీట్ లో ‘పవనిజమ్’ పేర్కొంది. అయితే, గతంలో జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో పవన్ గురించి మాట్లాడాలంటూ ఆయన అభిమానులు అల్లు అర్జున్ ని కోరడం, అందుకు, బన్నీ ‘ససేమిరా’ అనడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘మెగా’ దీపావళి ఫొటోలో ఉన్న అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ ను పవన్ అభిమాని ఎడిట్ చేశాడు. పవన్ సెల్ఫీ తీస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News