: సచివాలయాన్ని కూల్చే ఆలోచన లేదు: కోర్టుకు తెలిపిన కేసీఆర్ సర్కారు


తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసే ఆలోచన తమకు లేదని కేసీఆర్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను పది రోజుల పాటు వాయిదా వేసే ముందు ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కొత్త భవనాలు నిర్మించాలన్న విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కూల్చాలన్న ఆలోచన తమకు లేదని, ఈ విషయంలో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వేయకుండా ఈ పిటీషన్లేంటని ప్రశ్నించారు. దీన్ని కొట్టివేయాలని కోరగా, వినిపించిన వాదనలనే కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని చెబుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News