: మార్కెట్లకు ట్రంప్ భయం.. నష్టపోయిన అమెరికా స్టాక్ మార్కెట్లు


ప్రపంచ మార్కెట్లకు అమెరికా అధ్యక్ష పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భయం పట్టుకుంది. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై మళ్లీ విచారణ చేపడుతున్నట్టు ఎఫ్‌బీఐ ప్రకటించిన మరుక్షణమే అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం సోమవారం ఆసియా మార్కెట్లపైనా పడింది. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే జపాన్ యెన్ పుంజుకుంది. ఆసియా పసిఫిక్ షేర్లను సూచించే ఎంఎస్సీఐ సూచీ 0.2 శాతం నష్టపోయింది. జపాన్‌ నిక్కీ కూడా 0.6శాతం నష్టానికి గురైంది. యూరోప్‌తోపాటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

  • Loading...

More Telugu News