: సైనికులకు బాలీవుడ్ ‘బాద్షా’ షారూఖ్ కవితా సందేశం!


ఈ దీపావళిని సైనికులకు అంకితమివ్వాలని, వారికి సందేశం పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ స్పందించాడు. సైనికులకు ఓ కవితా సందేశాన్ని పంపాడు. సైనికులకు పంపిన ఆ కవితా సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘మన పాదాలు తివాచీల మీద. వారి బూట్లు నేలపైన. మన రోజులు ప్రశాంతం. వారికి రోజూ కొత్త సవాళ్లు. మన రాత్రులు ఆహ్లాదకరం. వారి త్యాగాల వల్లే మనం జీవిస్తున్నాం. వారి కష్టం మరుగున పడిపోకూడదు. వారు పోరాటం చేస్తున్నారు. అందుకే దేశం ఎదుగుతోంది. త్రివర్ణ పతాకం ఎగురుతోంది’ అంటూ షారూఖ్ రాసిన కవిత ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News