: ‘సదర్’ సమ్మేళనంలో స్టెప్పులేసిన నాయిని
ప్రతి ఏటా హైదరాబాద్ లో నిర్వహించే సదర్ ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ లో జరిగిన సదర్ సమ్మేళనంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని స్టెప్పులేస్తూ అక్కడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, ఖైరతాబాద్, నారాయణగూడ, అమీర్ పేట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ వేడుకలు కన్నుల పండువగా జరగుతున్నాయన్నారు. కాగా, పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన దున్నపోతుల ప్రదర్శన ఆకట్టుకుంది.