: ఆ విషయంలో బాలకృష్ణ నాకు ఇన్సిపిరేషన్ : హాస్యనటుడు పృథ్వీ
‘నేను షూటింగ్ కు వెళ్లేటప్పుడు నా ఫుడ్ నేనే తీసుకువెళతాను. నేను పొద్దున్నే ఐదు గంటలకే నిద్ర లేచి పూజ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన ఫుడ్ ఏదో అది నేనే తయారు చేసుకుంటాను. హెల్త్ పరంగా బాగుంటుంది, యూనిట్ లో కూడా మంచి రిమార్క్ ఉంటుంది. నేను కార్ వాన్ లో కూడా కూర్చోను. దానికి ఇన్సిపిరేషన్ బాలకృష్ణ గారే. బాలకృష్ణ గారు ఓన్లీ మేకప్ వేసుకుని, టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు. కార్ వాన్ లో కూర్చుంటే జైలు లాగా ఉంటుంది. బయట కూర్చుంటే అందరితో సరదాగా ఉండొచ్చు. వాళ్లతో మాట్లాడొచ్చు’ అని సినీ హాస్యనటుడు పృథ్వీ చెప్పుకొచ్చారు.