: ఐటీబీపీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు
దీపావళి పండగ సందర్భంగా ఐటీబీపీ జవాన్లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నూర్ జిల్లాలోని ఐటీబీపీ జవాన్లను ఈరోజు ఆయన కలిశారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. సైనికులకు ప్రధాని మిఠాయిలు తినిపించారు. జవాన్లతో కలిసి ఫొటోలు కూడా దిగారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేశారు.