: అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన రజనీకాంత్!


ఇటీవల వైద్య పరీక్షలకు అమెరికాకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్, తన అభిమానులను దీపావళి పండుగ నాడు కలుసుకోవాలన్న ఉద్దేశంతో సడన్ గా ఇండియాకు వచ్చి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ ఉదయం రజనీకాంత్ ను పోయస్ గార్డెన్ లోని ఆయన ఇంట్లో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఆయన్ను దీపావళి సందర్భంగా శాలువాలతో సన్మానించి ఆనందించారు. ఈ సందర్భంగా తాజా చిత్రం, రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిన 'కబాలీ' 100 రోజుల సెలబ్రేషన్స్ ను సైతం అభిమానులు సందడిగా జరుపుకున్నారు. వచ్చే సంవత్సరం రోబో సీక్వెల్ '2.0' విజయంతో దీపావళిని జరుపుకుంటామని ఈ సందర్భంగా అభిమానులు తెలిపారు.

  • Loading...

More Telugu News