: ఏ క్షణమైనా మెరుపుదాడి... ఏజన్సీ ప్రజాప్రతినిధులు మైదానాల్లోకి వెళ్లాలి: ఏపీ పోలీసుల హెచ్చరిక
గత వారపు ఎన్ కౌంటర్ లో 30 మందిని కోల్పోయిన మావోయిస్టులు పగతో రగిలిపోతున్నారని, వారు ఏ క్షణమైనా మెరుపుదాడికి పాల్పడే అవకాశాలు ఉన్నందున విశాఖ ఏజన్సీ, ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని ప్రజా ప్రతినిధులు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. ఏజన్సీలో అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. ప్రజా ప్రతినిధులు కొంత కాలంపాటు స్వగ్రామాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా, మల్కన్ గిరి, పాడేరు ఆసుపత్రుల్లో ఇంకా 12 మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయి. వీటిల్లో పాంగి జ్యోతి, శ్వేత మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు వారి బంధువులు అంగీకరించలేదు. గుర్తు తెలియని మృతదేహాలకు అంత్యక్రియల విషయమై పోలీసు వర్గాలు నిర్ణయం తీసుకోనున్నాయి.