: కుషాయిగూడలో విషాదం.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో బాలిక మృతి
మేడ్చల్‌లోని కుషాయిగూడ అశోక్‌నగర్‌లో ఈ రోజు విషాద ఘటన జరిగింది. పద్నాలుగేళ్ల వర్ష అనే బాలిక విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. పండుగ వాతావరణంలో బాలిక తన స్నేహితురాలితో కలిసి భవనంపై ఆడుకుంటుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి బాలిక ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆరోపిస్తున్నారు.