: నేను క్షేమం... ఇంట్లోనే ఉన్నాను: గోపన్న
రాజమండ్రిలో మాజీ మావోయిస్టు కోమల శేషగిరిరావు అలియాస్ గోపన్న అదృశ్యం సస్పెన్స్ వీడింది. మీడియాలో ఆయన అదృశ్యంపై వార్తలు వెలువడడం, రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదుతో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను క్షేమంగా ఉన్నానని ప్రకటించారు. రాజమండ్రిలో స్నేహితుడి నివాసం నుంచి తన ఇంటికి వచ్చేశానని చెప్పారు. అయితే ఆయన ఇంటి నుంచి బయల్దేరే క్రమంలో తన ఫోన్ పోగొట్టుకున్నానని, దీంతో ఆయనకు సమాచారం అందించలేకపోయానని తెలిపారు. తనపై ఆందోళన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలని అన్నారు.