: రాజమండ్రిలో మాజీ మావోయిస్టు గోపన్న అదృశ్యం
రాజమండ్రిలో మాజీ మావోయిస్టు అదృశ్యం పెను కలకలం రేపుతోంది. ఏవోబీలో కోవర్టు ఆపరేషన్ ద్వారా పెద్దఎత్తున మావోయిస్టులను పోలీసులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, లేదా మాజీ మావోలే ఇందుకు కారణమని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమండ్రిలోని స్నేహితుడి నివాసంలో నిన్న ఉదయం నుంచి ఉంటున్న కోమల శేషగిరిరావు అలియాస్ గోపన్న ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఆయన అదృశ్యంపై ప్రకాశ్ నగర్ పోలీసు స్టేషన్ ను ఆయన స్నేహితుడు ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.