: టెస్ట్ డ్రైవ్ పేరిట ‘ఆడి’తో ఉడాయించాడు!


టెస్ట్ డ్రైవ్ పేరిట ‘ఆడి’ కారుతో ఉడాయించిన ఘనుడి ఉదంతం ఇది. హైదరాబాద్, బంజారాహిల్స్ లోని ‘ఆడి’ షోరూమ్ కు వెళ్లిన సదరు వ్యక్తి, తాను డాక్టర్ నని, టెస్ట్ డ్రైవ్ కు కారు ఇవ్వాలని అక్కడి వ్యాపారిని కోరాడు. దీంతో, ఆ మాటలు నమ్మిన సదరు వ్యాపారి ఏపీ 28 బీ ఆర్ 0005 అనే నంబరు గల కారును టెస్ట్ డ్రైవ్ కు ఇచ్చాడు. అంతే, ఎంతసేపటికీ అతను తిరిగిరాకపోవడంతో, ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News