: అమ్మా నాన్నలను చూసి కుళ్లుకునే బుజ్జాయి... 1.5 కోట్ల మందిని అలరించింది!


సామాజిక మాధ్యమాల్లో ఓ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది. ఈ నెల 3వ తేదీన దీన్ని పోస్ట్ చేస్తే, 1.5 కోట్ల వ్యూస్, లక్షకు పైగా రియాక్షన్స్, 1.3 లక్షల షేర్స్ తెచ్చుకుంది. ఇంతకీ ఇందులో ఏముందనా? అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతంలో ఉన్న చిన్నారి ఎల్లా. ఎప్పుడూ తన తల్లిదండ్రుల మధ్య ఆనందంగా ఉండే ఈ బుజ్జాయికి ఏడుపు ఎప్పుడు వస్తుందో తెలుసా? తన అమ్మని నాన్న ముద్దు పెట్టుకున్నప్పుడు. తల్లిదండ్రులు ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుంటే, జలసీతో కుళ్లి కుళ్లి ఏడవడం, ఆపై వారిద్దరూ లాలనగా, తనకు ముద్దు పెడితే సంబరపడి పోవడం.. ఎన్నిసార్లయినా ఎల్లా చేసేదిదే. ఎల్లా తండ్రి ఈ వీడియోను తీసి పోస్ట్ చేయగా, పట్టుమని ఏడాది వయసు కూడా లేని ఆ పాప జెలసీ ఇప్పుడందరినీ అలరిస్తోంది.

  • Loading...

More Telugu News