: మంత్రి ఈటల ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఈరోజు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కమలాపూర్ లోని ఈటల ఇంటిని ముట్టడించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.