: మంచు కురవడం మొదలయ్యే లోపల సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే యత్నంలో పాక్


పీవోకేలోకి ప్రవేశించి భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై పాకిస్థాన్ రగిలిపోతోంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో, మంచు కురవడం మొదలయ్యే లోపల భారత భూగాగంలోకి ఉగ్రవాదులను పంపి, మారణహోమం సృష్టించేందుకు చూస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పులు మరో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. గత నాలుగు రోజులుగా పాక్ కు చెందిన ఎస్ఎస్ జీ కమెండో ప్లటూన్లు బోర్డర్ వద్ద మోహరిస్తున్నాయి. 14 నుంచి 15 ప్లటూన్లను ఓ కల్నల్ ర్యాంక్ అధికారి పర్యవేక్షిస్తున్నారని ఇంటలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి. మరోవైపు, పాక్ కాల్పులను మన భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.

  • Loading...

More Telugu News