: చరిత్రలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు


మీరు చదివింది నిజమే. ఏసుక్రీస్తు సమాధిని చరిత్రలో తొలిసారి తెరిచారు. జీసస్ సమాధిపై ఉన్న చలువరాతిని తొలగించారు. వివరాల్లోకి వెళితే, జీసస్ ను సమాధి చేసిన ప్రాంతంలో అప్పట్లో ఓ పెద్ద చర్చిని నిర్మించారు. దాని మధ్యలో సమాధి చుట్టూ ఓ చిన్న నిర్మాణం ఉంది. దీన్నే 'ఎడిక్యుల్' అంటారు. ఈ నిర్మాణం చాలా అందంగా ఉంటుంది. అయితే, అక్కడ గతంలో ఓ సారి అగ్నిప్రమాదం సంభవిస్తే 1808, 1810 మధ్య దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం చర్చిని మరోసారి పునరుద్ధరిస్తున్నారు. ఇందులో భాగంగానే, సమాధిపై ఉన్న చలువరాతిని... చర్చి మతపెద్దల సమక్షంలో అతి జాగ్రత్తగా పరిశోధకులు తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తర్వాత, క్రీ.శ.1555 నుంచి అత్యంత పవిత్రమైన ఈ చలువరాతిని ఏనాడు కదపలేదు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్టు ఫ్రెడ్రిక్ హైబర్ట్ మాట్లాడుతూ "సమాధి పైభాగాన ఉన్న చలువరాతిని తొలగించాం. దీని కిందే క్రీస్తును ఉంచారు. క్రీస్తు సమాధిపై ఉన్న చలువరాతిని ఇప్పుడు అందరం చూడగలుగుతున్నాం. రాతి కింద ఉన్న వస్తువులను చూసి మేము ఆశ్చర్యపోయాం. సుదీర్ఘకాలంగా జరిగిన విశ్లేషణల అనంతరం చలువరాతిని తొలగించాం", అని తెలిపారు.

  • Loading...

More Telugu News